Prardhinchumu sanghamaa ప్రార్దించుము సంఘమా

ప్రార్దించుము సంఘమా - ప్రార్ధనయే భక్తుని ప్రాణమని

1.ప్రభువైన యేసే ప్రార్ధన చేయగ - ప్రార్ధన బలమేమో గమనించవా
ప్రార్ధనలో జీవమున్నదనీ - ప్రభుని భక్తులెందరో గమనించిరి  ||ప్రార్దించుము||

2.ప్రార్దించుమని ప్రభువు పలికిన ఆజ్ఞను - వ్యర్థ పరచకుండా జరిపింపవా
స్వార్ధ చిత్తము వీడి సకల లోకమునకై -
ప్రార్ధించి ప్రభు మన్ననలు బొందవా ||ప్రార్దించుము||

3.సాతాను శక్తులను పడగొట్టి ప్రభుకొరకు - వెతలనొందువారు ప్రార్ధించిరి
గతి తప్పి మతిపోయి బ్రతుకే లేదనువారు - క్షితిపై ప్రార్ధనలోనే మేలొందిరి ||ప్రార్దించుము||

No comments: