Mannu ninnu sthuthinchuna మన్ను నిన్ను స్తుతించునా ప్రభువా

మన్ను నిన్ను స్తుతించునా ప్రభువా - సమాధి నిన్ను కీర్తించునా (2)
దేవా యెహోవా రావా కనరావా - కరుణించుము
నన్ను బ్రతికించుము - నిత్యము నేను నిన్ను స్తుతియించెదను

1.పాడైన స్థలములోని పగిడికంటివోలె - 
నిశీధిలో నేను తిరుగులాడుచుంటిని (2)
నీటి కొరకు వేచిన గూడబాతువోలె (2)
నీదు రాకకై ఎదురుచూచుచుంటిని (2)
||మన్ను||

2.ఎగిరిపోవు పొగవలె కరిగిపోవుచుంటిని - 
మరల తిరిగిరాని ఆవిరివలె యుంటిని (2)
నా జీవిత దినములు యుద్ధ దినములాయె (2) 
నీ చేతి సాయముకై ఎదురుచూచుచుంటిని (2)
||మన్ను||

No comments: