05 October 2022

Prabhuva Prabhuva kadalini| ప్రభువా ప్రభువా కడలిని

ప్రభువా ప్రభువా
కడలిని మా గాథ వినవా
ప్రభువా ప్రభువా
ఇకనైనా మా జాలి గనవా
ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు
ఎన్నాళ్ళు ఇంకా ఈ శోధనల్ ||ప్రభువా||

ఎదలో చెలరేగే సుడిగాలుల్లో
ఎగసే ఆశ నిరాశ కెరటాలు
నావకు చుక్కానివై
నాలో ధైర్యం కలిగించవా
సహనము శాంతము కరువు అయిన బ్రతుకులో
మరియ తనయా మరి ఇంకా ఎన్నాళ్లీ శోధనల్ ||ప్రభువా||

దేవా నీ దయలో ధన్యుడనవ తగనా
నాలో విశ్వాసం ఇంకా చాలాదనా
మందలో నీ అండలో
నేను ఉన్నా గొర్రెపిల్లనై
దీనులు అనాథలు అభాగ్యులైన ఎందరినో
నడిపించు ఓ తండ్రి నాకింక ఎన్నాళ్లీ శోధనల్ ||ప్రభువా||

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...