24 September 2022

Manninchuma manninchuma| మన్నించుమా మన్నించుమా


మన్నించుమా మన్నించుమా (2)
మన్నించుమా దేవా మన్నించుమా  

లోకాన్ని ప్రేమించి పాపాన్ని ఆశించి
నిన్ను నే కాదని వెళ్ళితి గతిలేని స్థితికి చేరితి  

మాట తప్పాను నిన్ను మరిచాను
క్షమియించి నన్ను బ్రోవుమా
కాదనక నన్ను కావుమా  

ఆదాము పాపమును క్షమియించినావే
చర్మపు వస్త్రమును నిర్మించినావే
కడపటి ఆదామై ఏతెంచినావే
ఈ పాపి కొరకై రిక్తునిగా మారావే
ఇంత చేసిన నీవు నా యెడల మోనమా
చెంత చేరిన నన్ను కాదనకు ప్రాణమా  

దావీదు పాపమును క్షమియించినావే
ఆ మరణ శాసనము రద్దు చేసినావే
దావీదు పట్టణమందు నా కొరకె పుట్టావే
ఈ గోరపాపి కొరకే బలియాగమయ్యావే
ఇంత చేసిన నీవు నా యెడల మోనమా
చెంత చేరిన నన్ను కాదనకు నేస్తమా 
DOWNLOAD MP3 SONG 👇

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...