07 August 2022

Marachipolede mammunu | మరచిపోలేదే మమ్మును

మరచిపోలేదే మమ్మును ఎపుడు యేసయ్యా
తొలగిపోనీక మాపైనుండి నీ దయ 
నీ ప్రేమకు కొలతే లేదయా 
ఏమిచ్చినా ఋణము తీరదయా 
నిన్నే స్తుతియించెదమయ్యా 

మాకు కాదు ఏ మాత్రమును 
నీ నామమునకే మహిమ కలుగును

1.నెరవేర్చితివి పనులన్నిటిని 
ఫలమేమి పోనీయలేదే
ఆశీర్వదించినావే - మమ్మాశీర్వదించినావే
సహాయము కేడెము నీవే 

2.బదులిచ్చితివి మొరలన్నిటికి
తలదించుకోనీయలేదే 
అభివృద్ధి చేసినావే - మమ్మభివృద్ధి చేసినావే
సహాయము కేడెము నీవే 

3.గెలిపించితివి ప్రతి సమరములో 
అపకీర్తి రానీయలేదే 
ఆనందపరచినావే - మమ్మానందపరచినావే
సహాయము కేడెము నీవే

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...