Sreshtudellavaarilonu maa yesuve | శ్రేష్ఠుఁడెల్లవారిలోను మా యేసువే

176
One There is above all others

1.శ్రేష్ఠుఁడెల్లవారిలోను - మా యేసువే
తల్లికంటె ప్రియుడౌను - మా యేసువే 
లోకస్నే హమస్థిరంబు - నేఁడు ప్రేమరేపు కక్ష 
స్థిరుడైన మిత్రుడౌను - మా యేసువే.

2.నాకు నిత్యజీవమౌను - మా యేసువే 
సర్వమందు సర్వమౌను - మా యేసువే 
నన్ను మేలుకొల్పి ప్రోచి - శుద్ధిచేసి ప్రేమతోడ 
నన్ను తన మందఁజేర్చె - మా యేసువే.

3.ప్రేమమూర్తి సత్యవర్తి - మా యేసువే
ఇహపరభాగ్యమిచ్చు - మా యేసువే
క్రీస్తుకిమ్ము నీదుయాత్మ - నీకు శాంతినిచ్చి కాచి
తుదిఁజేర్చు మోక్షమందు - మా యేసువే.

4.బాధనొందు మేము చేర - మా యేసువా!
మాకు హర్ష మిచ్చినావు - మా యేసువా!
ఇహమందు నడిపించు - అవసానకాలమందు మోక్షసౌఖ్య మొందనిమ్ము - మా యేసువా!
       – జాన్ న్యూటన్
అను: జె. హే.

No comments: