166
పాపియెడల యేసు ప్రేమ
(ఛాయ: ధరణిలోని ధనము)
రా - యదుకుల కాంభోజి, తా - ఆది
యేసురాజు నీదు ప్రేమ - నెంచ తరముగాదయా = దోషియైన నన్ను బ్రోవ - నీసుప్రాణమిడితివా ||యేసురాజా||
1.మంచివాని కొరకు నొకఁడు - మరణ మొందుటరుదుగా = అంచితమగు ప్రేమ చేత - మించి గాయము లొందినా ||వేసు||
2.చెయ్యరాని దుష్కర్మములుఁ - చేసి నే చెడియుండగా = అయ్యో మ్రానుమీఁ దికీవు - ఇయ్యకొని మోసితివా ||యేసు||
3.గెత్సేమనె వనములోకిఁ - జొచ్చి తండ్రికి చిత్తమై = యిచ్చిన నా శ్రమలపాత్రన్ - బుచ్చుకొని భరించినా ||వేసు||
4.హస్తము,పాదము,ప్రక్కలు - మస్తకపు గాయములలో = విస్తరించి చిందె నీ ప్ర - శస్త రక్తమంతయున్ ||యేసు||
5.కొండమీద నిన్నుఁజూడ - గుండెలదిరిపోవునే = నిండు ప్రేమ చేత నావగు - మెండుబాధల నోర్చినా ||వేసురాజా||
6.మరువలేను నీదు ప్రేమ - మరణపరియంతంబు నా = నరక బాధలన్ని నీవా - కొరతపై వహించినా ||వేసురాజా||
7.నిన్నుదలఁచ నా నిరీక్షణ - యున్నతము గానుండును = యెన్నడు నీ మహిమను నా - కన్నులారఁజూతునో ||యేసురాజా||
– చదలవాడ తామస్
No comments:
Post a Comment