Thriyka devuda yehova| త్ర్యేక దేవుఁడ యెహోవ

591 
అపోస్థలుల విశ్వాస ప్రమాణము
(ఛాయ: శరణు శరణు యేసు)
రా – నాధనామక్రియ, తా - రూపాకము

     త్ర్యేక దేవుఁడ యెహోవ - దేవు - నే నమ్మి సేయుదు సేవ - దేవ = పరలోక భూలోక - ముల నెల్లఁ బుట్టించి - పాలించు తండ్రి దే - వుని నమ్మెదను నేను ||త్ర్యేక||

1.శ్రీ దేవసుతుఁ డేసు క్రీస్తే - యేక - చిరజీవ నాధుండు నాకే - దేవ = కన్య మరియమ్మ గ - ర్భమున జన్మించిన - కరుణగల దేవునిఁ - గూర్మితో నమ్మెదఁ ||ద్ర్యేక||

2.పొంతి పిలాతు కాలమున - యేసు - పొంది శ్రమలను సిలువమీద - దేవ = కొట్టఁబడి చనిపోయి - పెట్టఁబడి భూమిలో - మూఁడవ దినమందు - మృతి గెలిచి లేచెను ||త్ర్యేక||

3.పరలోకమున కెక్కె యేసు క్రీస్తు - పరమతండ్రికిఁ గుడివైపు = దేవ సింహాసనముమీఁద - స్థిరముగాఁ గూర్చుండి - యున్నాఁడు చిరన్యాయ - కర్తయై యున్నాఁడు ||త్ర్యేక||

4.అక్కడనుండి ప్రభు యేసు - వచ్చు - నిక్కముగఁ దీర్పుఁ దీర్చుటకు - దేవ = మరణ మొందినవారికి - బ్రతికి యున్నవారికి - న్యాయంబుఁ దీర్చును - న్యాయవంతుఁడు యేసు ||త్ర్యేక||

5.శుద్ధాత్మ దేవుని నేను - మన - శుద్ధితో నమ్మి కొల్చెదను - దేవ = శుద్ధ సంఘంబు పరి - శుద్ధుల సహవాస - మును నమ్మెదను నిత్య - మును నేను నిజ మిది ||త్ర్యేక||

6.పాపక్షమాపణను నేను - ఎంతో బలముగా నమ్మెద నిలను - దేవ = ఈ శరీరముపోయి - యంత్యదినమున మరల - లేచునని తిరముగా - వాసిగా నమ్మెదఁ ||త్ర్యేక||

7.నిత్యజీవము నమ్మెదను - నేను నిజముగా శ్రీ యేసు పేర - దేవ = నిత్యుండు తండ్రి దే - వుఁడు కుమారుండును - ఆత్ముండు సత్యుండు - త్ర్యేకుఁడౌ దేవుండు ||త్ర్యేక||
                 – మార్తాండ జ్ఞాన ప్రకాశము

No comments: