590
అపోస్థలుల విశ్వాస ప్రమాణము
(ఛాయ: దుష్టుల తలపున)
రా - జంజాటి, తా - ఆది
పరలోక భూలోకంబులకును - బ్రభువును సృష్టికర్తయునౌ = పరమ శక్తుఁ డౌ తండ్రి దేవుని - భక్తితో నమ్ముచు నున్నాను ||పరలోక||
1.ఆయన యద్వితీయ సుతుండౌ - నా యేసుని నమ్ముచు నుందు = నాయన పరిశుద్ధాత్మ వలనఁ గ - న్యా మరియమ్మకు జన్మించెఁ ||పరలోక||
2.పొంతి పిలాతు అధికారంబునఁ - బొంది సిలువ బాధను మృతుఁడై = యంతట భూస్థాపనముఁ జేయఁబడి - యదృశ్య లోకమునకు దిగెను ||పరలోక||
3.మరి మూఁడవ దినమునఁ జనిపోయిన - మనుజులలో నుండియు లేచి = పరలోకంబున కెక్కి తండ్రి కుడి - పార్శ్వంబునఁ గూర్చున్నాఁడు ||పరలోక||
4.అక్కడ నుండి బ్రతికియున్న జను - లందరిఁ జనిపోయినవారిఁ = జక్కంగను విమర్శించుటకును - జను నని నమ్ముచునున్నాను ||పరలోక||
5.పరిశుద్ధాత్మను నమ్ముచు నుందును - బావన సార్వత్రిక సభను = ధర నైక్యతఁ బాపక్షమఁ బునరు - త్థాన సుజీవము నమ్ముదు నామేన్ ||పరలోక||
– మల్లెల దావీదు
No comments:
Post a Comment