నీ ఆరోగ్యకరమైన రెక్కలపై - సంవత్సరమంతయు మోసినావు (2)
నా ప్రాణానికే మూలమా పరిశుద్ధాత్ముడా
నా శ్వాస నిశ్వాసలలో - స్థాపించితివే నీ స్తుతుల సింహాసనం ||పక్షిరాజు||
1.నాపైనున్న సువార్త కాడి · బహుగా భారము కలిగినవేళ
నీ మీద కాని తలంచగానే - నా మీద కాడి తేలికాయెను
పక్షులకు గూళ్లు నక్కలకు బొరియలు - ఉన్నవి నీకు స్థలమే లేదు
శ్రమలలో నడచి సువార్త చేసి - నీ ప్రాణమును అప్పగించితివి ॥పక్షిరాజు॥
2.ఆది సంఘము నీవు స్థాపించిన వేళలో - అనుదిన ప్రార్థన ఊపిరిగా మారెను
అరణ్యములో మోకాళ్లపై నిలచి - ప్రార్థన చేసి మాదిరిని చూపితివి
నాకు అప్పగించిన ఈ పరిచర్యలో - ప్రార్థన క్రమమును ఉంచి నడిపించు చుంటివి
ఊహలకు అందని ఆశ్చర్యకార్యములు - ఎన్నెన్నో చేసి నడిపించితివి ॥పక్షిరాజు||
3.పశులకాపరి ఆమోసును ప్రవక్తగా - పిలిచితివి
బాతుల కాపరి అయిన నాకు - సంఘమును ఇచ్చితివి
వృద్ధియు క్షేమము మితి లేకుండ - నీకు కలుగ జేసెదనను చూ
లిఖంపబడిన దయాకిరీటం - నా తలపై ఉంచితివి ॥పక్షిరాజు||
No comments:
Post a Comment