153
యేసును అనుకరించుట
(ఛాయ: మేలుకొనరే)
రా – బిలహరి, తా – త్రిపుట
నేర్చుకొనరే - యేసువాడుక - లనుదినము మీ బ్రతుకునందున - నేర్చుకొనిన - మీరలాయన జనముగ నొప్పుదురు - ఇలలో ||నేర్చుకొనరే||
1.ఆలయ - ఆరాధనలకు - బోయెడియలవాటుగలిగియు - చాలమారులు ఆలయమునకు అరగిన యా ప్రభుని వాడుక ||నేర్చుకొనరే||
2.దేవవాక్య పఠనమందున - దీక్షగలిగియు మరియ సుతుడు - దివ్యముగ నా గ్రంథ పఠనము - జేసినవిధంబు మీరలు ||నేర్చుకొనరే||
3.పరమ తండ్రికి - ప్రార్థనలు ప్రతివేళ జేయుట పరమవిధియని మరువకను - ప్రార్ధించి మనలను - నిరతమును ప్రార్ధింపమనెను ||నేర్చుకొనరే||
4.బీద పాపులు - బాధితులు - బంధింపబడిన వారి కెల్లను - ఆదరము జూపించి మేలును - జేసిన విధంబు మీరలు ||నేర్చుకొనరే||
5.సువార్త ప్రకటనజేయుట - సుభాగ్యముగ దానెంచి - యీ భువి సేవలో సువార్త జాటుచు సంచరించిన - యేసు వాడుక ||నేర్చుకో||
6.అక్కరలలో దన్నుజేరి - మక్కువతో బ్రార్ధించి వేడిన - పెక్కు జనముల - యక్కరలను జక్కగ దీర్చిన విధంబును ||నేర్చుకొనరే||
7.దైవచిత్తము దీర్చుటయే తన - ధర్మ విధిగ నెరిగి యాయన - ధరణిలో నా ధర్మమునకై - మరణమొందిన - విభుని మాదిరి ||నేర్చుకొనరే||
– ఈతకోట ప్రకాశము
No comments:
Post a Comment