660
దొరకుతావురా సహోదరా! దొరుకుతావురా, నీవు తరిమి తరిమి కీడుచేయ పరుగులెత్తినగాని తుదకు ||దొ||
1.చిన్న చూపు చూచి తమ్ముని - కన్నెఱుంగక చంపినగాని
అన్న కయీను - దేవుని హస్తమునకు దొరికిన రీతిగా ||దొ||
2.వరములొందిన తమ్ముని - జంప వలయునని పంతముగబట్టి
నరకవచ్చిలోబడి యేడ్చిన - దురిత చరితుని యేశావువలె ||దొ||
3.భక్త దావీదును బట్టి - ప్రాణము దీయగ దలచిన తన
శక్తితో తరిమిన రాజగు - సౌలు దొరికినరీతిగాను ||దొ||
4.విగ్రహమునకు మ్రొక్కని దైవ - పిల్లల నగ్నిలోపడవైచి
ఆగ్రహించిన నెబుకద్నెజరు - గడ్డిమోసి దొరికిన విధముగ ||దొ||
5.క్రైస్తవులను బట్టి కొట్టి - ఖైదులో వేయదలచినను
వాస్తవమగు వెలుగును - జూచి ప్రభుని చాటిని పౌలుబోలి ||దొ||
6.కీడుచేయబోకు మెపుడు - కీడు నీకే కీడు కీడు
కీడు చేసినమేలుచేసి - కీడును జయింపకపోతే ||దొ||
7.మాటలు కుదిరితే మాటలు - కోటలు కుదురును నీకు
మాటలలో లోటుంటే - నోటిమాట తప్పకుండ ||దొ||
8.దొంగతనము వ్యభిచారమునకు - లొంగి శాపగ్రస్తులునై
దొంగిలించిన దశమభాగమే - లొంగుట కారణమని తుదకు ||దొ||
9.కొంతయిచ్చిన దశభాగ - మంత యిదియని తప్పుకున్న
కొంతయిచ్చిన కయీనువలె - కొంతయిచ్చిన అననియవలె ||దొ||
10.చెడుగుచేసి బదులు దానిని - చేసినారని చెప్పమన్న వడిగ
దేవుని న్యాయమనెడి - పరమత్రాసులో నిలువండి ||దొ||
No comments:
Post a Comment