Vandanam neeke vandanam | వందనం నీకే వందనం పరిశుద్ధ

189
గాయపర్చబడిన పరిశుద్ధ శిరస్సు
రా - ముఖారి (ఛాయ: చూడరే క్రీస్తుని) తా - త్రిపుట

వందనం నీకే వందనం - పరిశుద్ధ శిరమా - వందనం - నీకే - వందనం = వందనం బొనరింతు నీ దౌ - నందమగు ఘన నామమునకె ||వందనం||

1.సుందరుఁడ నీ శిరసు హేళనఁ - బొందె ముండ్ల కిరీట ముంచగ - నెందుఁ జూచిన రక్త బిందులు - చిందుచుండెడి గాయములతో - గ్రందెనా - మోము = కుందెనా యిక నే - నెందు బోవక నిన్నుఁ గొలిచెద - నందముగ మహిమ ప్రభువా ||వందనం||

2.భీకరుఁడ నీ యెదుట సర్వ - లోకములు వణికెడు ఘనముఖ - మే కరణి నుమి వేయఁబడియె వి - కార రూపము నొందికందెను - శ్రీకరా - శ్రీ శు - భాకరా = నే నీ ముఖ ప్రకాశము పాడుజేసితి - నో కరుణ భాస్కర క్షమించుము ||వందనం||

3.మించు నీ ముఖ లక్షణము లహ - మంచి పెదవుల రంగుఁ జూడఁగఁ - గొంచెమైనను గనుపడక కృ - శించి దౌడలు క్రుంగిపోవుట - నెంచఁగా నాలో - చించఁగా = ఆ నీ - యంచితపు బల శౌర్యములు హ - రించి పోయెను మరణ బలమున ||వందనం||

4.సిలువ యెదుటను నిపుడు నేనిఁక - నిలిచి నినుఁ బ్రార్థింతుఁ బ్రభువా - ఖలుఁడ నని ననుఁ ద్రోయకుము నే - నలసి సొలసిన నిన్ను విడువక - పిలిచెద నిన్నేఁ - గొలిచెద = నీ తల - బలిమి చావున వాల్చగను నా - యేసు నినుఁ జేతులతో నాపెద ||వందనం||

5.నిన్ను నేఁ గొనియాడుటకు నిపు - డున్న భాషలు చాల విఁక ని - న్నెటుల నే నుతియింతునో హో - సన్న రక్షక ప్రోవు న న్నెడ బాయకు - ఖిన్నునిఁ - జేయకు నా కొర - కిన్ని బాధల నొందితివి నా - యన్న నా జీవంబు నీదే ||వందనం||

6.మరణ దినమున భయము పడి నీ - కొర కెదురు జూడంగఁ గృపతో - వరబలుండా నా విరోధుని - కరకు శరములఁ ద్రుంచ రావె - శూరుఁడా - దేవకు - మారుఁడా = అటు నీ - మరణ రూపము సిలువపై నా - తరుణమునఁ జూపుము యెహోవా ||వందనం||
                         – రావూరి దావీదు

No comments: