Siluvalo siluvalo siluvalo | సిలువలో సిలువలో సిలువలో

సిలువలో.. సిలువలో - సిలువలో నా ప్రభువా
శ్రమలలో.. శ్రమలలో - శ్రమలలో నలిగేవా

1. సిలువలో నీ మేను - నిలిచెనా మేకులతో 
భరువుతో నీ తనువు - ఒరిగెనా వేదనతో ||సిలువ||

2. ముండ్లతో ఒక మకుటం - అల్లిరా నీ తలపై
చిరకతో నీ దాహం - తీర్చెనా ఈ లోకం ||సిలువ||

3. ప్రక్కలో బల్లెముతో - గ్రక్కునా బొడిచేరా
రక్తమే చిందేనా - శాంతమే మిగిలేనా ||సిలువ||

4 సిలువలో యేసు ప్రభో - శ్రమలలో క్రీస్తువహో
జాలిలేని  కోసం - ఏలానో ఈ సహనం ||సిలువ||
DOWNLOAD MP3 SONG HERE

No comments: