చెయి దాటిపోయిన స్థితులైననూ - అసలోడిపోనివ్వడు
ఓడిపోనివ్వడు - ఓడిపోనివ్వడు (2) -
ఓటమి తప్పని రోజైననూ - ఓడిపోనివ్వడు -
చెయి దాటిపోయిన స్థితులైననూ - ఓడిపోనివ్వడు (2) ||ఓడిపోనివ్వడు||
పందెమందు ఉండగా - ఓపికతో సాగాలిగా
ధైర్యం ప్రభు మనలో నింపెగా - పౌలు లాగా సాగాలిగా (2)
గురి యొద్దకే నీ ప్రయాణము - ఉన్నత పిలుపునకు బహుమానము (2)
సీయోనులో మన స్థానము సుస్థిరము (2) ||ఓడిపోనివ్వడు||
నా అన్న వారే కాదనగా - రక్త సంబంధులై వెల కట్టారుగా - బానిసలుగా చేసి అమ్మారుగా - యోసేపును చూసాడుగా (2)
తోడుండెనన్న వాగ్ధానము - రాజుల యెదుటే తనకు సన్మానము - మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము (2)
దాటిపోడెన్నడు - దాటిపోడెన్నడు (2)
దీన స్థితిలో మనమున్ననూ - దాటిపోడెన్నడు
నవ్వుల పాలైన రోజైననూ - దాటిపోడెన్నడు (2) ||ఓడిపోనివ్వడు||
No comments:
Post a Comment