21 February 2022

Kalavaramenduku kalatha | కలవర మెందుకు కలత

కలవర మెందుకు కలత చెందకు 
వేదనలెన్నైనా శోదనలెదురైనా సిగ్గుపడనీయ్యడూ
నా యేసయ్యా ఒడిపోనీయ్యడూ 

1. శూన్యములో ఈ సృష్టిని - 
తననోటి మాటతో సృజియించినా (2)
యేసయ్యా నీతో ఉన్నాడులే - 
యేసయ్యా నీతో ఉంటాడులే (2)

2. అలలహోరులో పెనుగాలివీచినా - 
వెనుదీయనీ ఆత్మీయ యాత్రలో (2)
యేసయ్యా నీతో ఉన్నాడులే - 
యేసయ్యా నీతో ఉంటాడులే (2)

3. అగ్నిజ్వాలలే నిను చుట్టివేసినా - 
సింహాల మద్యన నీవుండినా (2)
యేసయ్యా నీతో ఉన్నాడులే - 
యేసయ్యా నీతో ఉంటాడులే (2)

4. ఆకాశపు వాకిళ్ళుతెరచి - 
పట్టజాలని దీవెనలొసగే (2)
యేసయ్యా నీతో ఉన్నాడులే - 
యేసయ్యా నీతో ఉంటాడులే (2)

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...