Ammallara o akkallara | అమ్మల్లారా ఓ అక్కల్లారా

అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)
ఈ వార్త వినరండే - యేసయ్యను నమ్ముకొండే (2)
మానవ జాతి పాపము కొరకై (2)
కన్నీరు విడుస్తుండు - ప్రభు రమ్మని పిలుస్తుండు (2) ||అమ్మల్లారా||

లోకమంతటా యేసు రక్తము (2)
ఎరువుగ జల్లిండే - మరణపు ముల్లును విరిచిండే (2)
అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)
ఓ పల్లె చెల్లెల్లారా - ఓ పట్నం అక్కల్లారా (2)

బట్టలు మార్చితే బ్రతుకు మారదు
గుండు కొడితే నీ గుణం మారదు
బతుకు మారడం బట్టల్ల లేదు
గుణం మారడం గుండుల లేదు
నీ మనసు మారాలన్నా - నీ బుద్ది మారాలన్నా
నీ మనసు మారాలక్కా - నీ బుద్ది మారాలక్కా ||అమ్మల్లారా||

పాపం లేని యేసు దేవుణ్ణి - నమ్ముకుందామమ్మా
దేవుడు మంచి దేవుడమ్మా (2)
అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)
ఈ సత్యమినరండే
ఇది కల్ల కాదు చెల్లె - ఇది కల్ల కాదు తమ్మి
ఇది కల్ల కాదు తాత - ఇది కల్ల కాదు అవ్వ
ఇది కల్ల కాదు అన్న - ఇది కల్ల కాదు అక్క

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: