శ్రీ యేసు పుట్టాడని ఈలోకానికొచ్చాడని - తంబురతోను సితారతోను ఉత్సాహగానము చేసెదము
ప్రభు యేసుని స్తుతించెదము - రారాజుని ప్రకటింతుము -
ప్రభు యేసుని స్తుతించెదము - రారాజుని పూజింతుము ||శ్రీ యేసు||
1. అల్పమైన స్వల్పమైన బెత్లహేములో - రారాజు రక్షకుడై ఉదయించినాడు (2)
పాపాన్ని క్షమియించే శాపాన్ని తొలగించే - పరిశుద్ధుడు యేసు పరమునుండి వచ్చినాడు (2)
పరిశుద్ధుడు యేసు పరమునుండి వచ్చినాడు ||ప్రభు||
2. మనసున్న మహారాజు మహిమను విడిచి - మనిషిని మహిమలో చేర్చగా వచ్చినాడు (2)
మరణాన్ని దాటించి జీవంలో నడిపించే - మరణము లేని మెస్సయ్యా వచ్చినాడు (2)
మరణము లేని మెస్సయ్యా వచ్చినాడు ||ప్రభు||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment