05 December 2021

Ningi Nela Murisipoye | నింగి నేల మురిసిపోయే

నింగి నేల మురిసిపోయే - అంబరమే మెరిసిపోయే
రండి రండి రండి చేరా రారండి 

దేవాది దేవుడండి రక్షింప వచ్చెనండి
రక్షకుని జనన వార్త వినండి 

నెమ్మదినిచ్చే వాడు నిను చూడా వచ్చాడు
లోకాన్నేలే వాడు నీకై నాకై పుట్టాడు

చీకటి నిండిన లోకంలో వేకువనిచ్చే రేడు 
ఇష్టులైన వారికి సమాధానం నేడు 
పాపం శాపం తీసివేసే గొప్ప దేవుడండి
మార్గం సత్యo జీవo తానే సర్వశక్తుడండి
నీ పాపo శాపo తీసివేసే గొప్ప దేవుడండి
మార్గం సత్యo జీవo తానే సర్వశక్తుడండి

బoగారు బోళము సాoబ్రాణి కానుకలిచ్చిరి నాడు 
నీ గుoడె గుడిని కానుకగా ఇవ్వాలి నేడు 
అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడండి 
భువిలో దివిలో మహనీయుడండి 
అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడండి 
ఈ భువిలో ఆ దివిలో పూజ్యనీయుడండి

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...