అది రొట్టెల ఊరంటా - అది రక్షణ ఇల్లంటా (2)
పుట్టాడు ప్రభు యేసు - పశువుల పాకలో (2)
చూద్దాము రండి - వేడుక చేద్దాము రండి (2)
స్తుతులపై ఆశీనుడు - కన్య మరియ గర్భమున
పుట్టడంటా స్తోత్రార్హుడు మన ప్రభువు - పశువుల తొట్టిలో పరుండి నాడంటా (2)
జ్ఞానులు నడిచారంటా - ఆ వెలుగు మార్గాన వెళ్లారంటా (2)
గొల్లలు చాటారంటా - ఒక మంచి శుభవార్తను (2) అబ్రాహాము దేవుడు - ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు మన దేవుడు (2)
కెరూబుల ఆశీనుడు - సత్యమై మార్గమై వచ్చాడంటా (2)
ఎల్షాద్దాయి ఎల్రోరోహి - చుచుచున్న దేవుడు పుట్టడంటా (2)
తార చాటిందంటా - రక్షకుని జన్మ స్థలము (2) దూతలు పాడారంటా - సంతోష గానాలను (2)
No comments:
Post a Comment