Viluvaina Premalo | విలువైన ప్రేమలో

విలువైన ప్రేమలో  - వంచన లేదు
కల్వరి ప్రేమలో - కల్మషం లేదు
మధురమైన ప్రేమలో - మరణం లేదు
శాశ్వత ప్రేమలో - శాపం లేదు
యేసయ్య ప్రేమలో - ఎడబాటు లేదు - (2)
అద్భుత ప్రేమలో - అరమరిక లేదు (2)

1. వాడిగల నాలుక - చేసిన గాయం
శోధన సమయం - మిగిల్చిన భారం  (2)
అణచి వేయబడును - ఆశ్చర్య ప్రేమలో  (2)
నిలువ నీడ దొరికెను -నిజమైన ప్రేమలో(2)

2. నా దోషములను - మోసిన ప్రేమ
నాకై సిలువను - కోరిన ప్రేమ (2)
పరిశుద్ధ పాత్రగా - మార్చిన ప్రేమ  (2)
ఆశీర్వదించిన - ఆత్మీయ ప్రేమ  (2)
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: