సందేహమేల... సంశయమదేల..
ప్రభు యేసు గాయములను పరికించి చూడు -
గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2) ||సందేహ||
1. ఆ ముళ్ల మకుటము నీకై ధరియించెనే -
నీ పాప శిక్షను తానే భరియించెనే (2)
ప్రవహించె రక్తధార నీ కోసమే -
కడు ఘోర హింసనొందె నీ కోసమే (2) ||సందేహ||
2. ఎందాక యేసుని నీవు ఎరుగనందువు -
ఎందాక హృదయము బయట నిలవమందువు (2)
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా -
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) ||సందేహ||
3. ఈ లోక భోగములను వీడజాలవా -
సాతాను బంధకమందు సంతసింతువా (2)
యేసయ్య సహనముతోడ చెలగాటమా -
ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2) ||సందేహ||
4. లోకాన ఎవ్వరు నీకై మరణించరు -
నీ శిక్షలను భరియింప సహియించరు (2)
నీ తల్లియైన గాని నిన్ను మరచునే -
ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2) ||సందే||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment