Noothanamainadi Nee Vatsalyamu | నూతనమైనది నీ వాత్సల్యము

నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించేను 
ఎడబాయనిది నీ కనికరము - నన్నెంతో ప్రేమించెను
తరములు మారుచున్నను - దినములు గడుచుచున్నను - నీ ప్రేమలో మార్పులేదు (2) 

సన్నుతించెదను నా యేసయ్య - సన్నుతించెదను నీ నామమును (2)

1.గడచిన కాలమంత నీ కృపచూపి ఆదరించినావు -
జరుగబోయే కాలమంత నీకృపలోన నన్నుదాచెదవు (2)
విడువని దేవుడవు యెడబాయలేదు నన్ను - క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతి||

2.నా హీనదశలో నీప్రేమచూపి పైకిలేపినావు -
ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్య పరచినావు (2)
మరువని దేవుడవు ననుమరువలేదు నీవు - ఏ సమయమైనను చేయివిడువవు (2) ||సన్నుతి||

3.నీ రెక్కలక్రింద నన్నుదాచినావు ఆశ్రయమైనావు -
నా దాగుస్థలముగా నీవుండినావు సంరక్షించావు (2)
ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు - నన్ను సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతి||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: