Aadiyandu Unna Devudu | ఆదియందు ఉన్న దేవుడు

సంబరమాయే మా ఊరంతా ఆ రక్షకుని రాకతో 
దేశమా... ఆనందించుమా....
 నేస్తమా... .ఆరాధించుమా...

ఆదియందు ఉన్న దేవుడు - అద్వితీయ మహా దేవుడు 
మానవాళి ముక్తికొరకు రక్షకుడై - ఉదయించెను ఈ భువిపై (2)

చీకటి పోయెను మాఇంట - నిండెను మామది సంతోషంతో (2)
క్రిస్మమస్ సంబరమే మా ఊరంతా - ఆ రక్షకుని రాకతో - క్రిస్మమస్ ఆనందమే మా ఇంట ఆ రక్షకుని వెలుగుతో (2) 
దేశమా .... ఆనందించుమా (2)
నేస్తమా ...... ఆరాధించుమా ||ఆదియందు||

చీకటి పాపము తొలగించి వెలుగుతో మనలను నింపుటకై పాప శాపము పరిహరించి పరిశుద్ధులగా చేయుటకై (2)
సర్వోన్నతమైన ఆ స్థలమును విడిచి - పశువుల పాకకు యేతెంచేను (2)
ఎందరు అంగీకరించేదరో అందరికీ దేవుని పిల్లాలగుటకు అధికారమిచ్చెను (2)
దేవుని పిల్లలగుటకు అధికారమిచ్చెను ||చీకటి||

మరణ ఛాయలు తొలగించి - జీవము మనలో నింపూటకై - అపరాధములన్ని తీసివేసి - నీతిమంతులుగా చేయుటకై (2)
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఓ (2)
ఎందరు నమ్మి విశ్వ సించేదరో - అందరికీ రక్షణ భాగ్యమిచ్చి నిత్యజీవమిచ్చును (2)
రక్షణ భాగ్యమిచ్చి నిత్యజీవ మిచ్చును ||చీకటి||

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: