Rende Rendu Daarulu | రెండే రెండే దారులు ఏ దారి


రెండే రెండు దారులు - ఏ దారి కావాలో మానవా
ఒకటి పరలోకం మరియొకటి పాతాళం (2)
పరలోకం కావాలో పాతాళం కావాలో (2)
తెలుసుకో మానవా - నీవు తెలుసుకో మానవా (2)

పరలోకం గొప్ప వెలుగులో - ఉన్నాది పరిశుద్ధుల కోసం (2)
రాత్రియుండదు చీకటుండదు - సూర్యుడుండడు చంద్రుడుండడు
నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును (2)
యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును (2)
యేసు ప్రభుని నమ్ముకో - పరలోకం చేరుతావు (2) ||రెండే||

పాతాళం అగ్ని గుండము - ఉన్నాది ఘోరపాపుల కోసం (2)
అగ్ని ఆరదు పురుగు చావదు - గప్పగప్పున రగులుచుండును
ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు (2)
అబ్రహాము రొమ్ముపై లాజరును చూసాడు (2)
ధనవంతుడు చూసి దాహమని అరిచాడు (2) ||రెండే||

పుడతావు నీవు దిగంబరిగా - వెళతావు నీవు దిగంబరిగా (2)
గాలి మేడలు ఎన్నో కడతావు - నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు
లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు (2)
ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి (2)
అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో (2) ||రెండే||

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: