Maarpu Chendava Neevu | మార్పు చెందవా నీవు మార్పు

మార్పు చెందవా? నీవు మార్పు చెందవా? 
నీ మనసును మార్చుకోవా
మార్పు చెందవా? నీవు మార్పు చెందవా? 
నీ బ్రతుకు మార్చుకోవా

అనుకూల సమయం ఇదియేనని యెరిగి - మారు మనసును పొందవా (2)
మార్పు చెందవా? నీవు మార్పు చెందవా?
నీ మనసును మార్చుకోవా..నీ బ్రతుకు మార్చుకోవా

1.ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ - ఏముందీ ఈ లోకంలో - ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి - తీర్పున్నది పైలోకంలో (2)
తీర్పు దినమునందున - ఆయన ముందర నీవు - నిలిచే ధైర్యం నీకుందా (2) 
నిలిచే ధైర్యం నీకుందా|| మార్పు ||

2.దిగంబరిగానే వచ్చావు నీవు - దిగంబరిగా పోతావు- మన్నైన నీవు మన్నైపోతావు- ఏదో ఒక దినమందున (2)
దేవుడిచ్చిన ఆత్మ - దేవుని యొద్దకు చేరు - నీకంటూ ఏముందిలే (2) నీకంటూ ఏముందిలే || మార్పు ||

3.ఆత్మను కాక దేహాన్ని చంపే - మనుషులకు భయపడకయ్యా - ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే - దేవునికి భయపడవయ్యా (2)
నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు - నీ వెంట రావెప్పుడు (2) నీ వెంట రావెన్నడు || మార్పు ||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: