06 October 2021

మొదట ఎవరు?

🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం.🙏..

⛪నేడు దిన ధ్యానము⛪

✝️*** మొదట ఎవరు?***✝️

కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. 
- మత్తయి 6:33

మనం దేవుని కన్నా అధిక ప్రాముఖ్యత యిచ్చే దేని వలనైనా మరియు ఆయనతో సమానంగా స్థానమిచ్చే ఏదైనా ఉన్నట్లయితే, అది మనలను ఆత్మీయంగా బలహీనపరచి దేవుని మీద మనం కలిగియున్న ప్రేమను, విశ్వాసమును తక్కువగా చేస్తాయి.

మనల్ని సృష్టించి నిత్యం కాపాడుచూ అన్నియూ సమకూర్చుచున్న దేవుడిని అన్నిటిలోను మొదట ఉంచితే మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అన్నింటినీ పక్కన పెట్టి ఆయనకే మొదటి ప్రాధాన్యతనిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

అది జీవితాన్ని సవాలు చేసే నిర్ణయం. దేవునిని ముందుపెట్టి మన జీవితాన్ని ఆయనకు అప్పగించి, దేవుని కొఱకు మనం ఏదైనా సరే వదులుకునేందుకు సిద్ధంగావున్నట్లైతే, మన జీవితాలు ధన్యమైనట్లే.

🛐ప్రార్థనా:🛐

పరలోకమందున్న ఓ మా ప్రియ తండ్రి, మా జీవితంలో మొదట ప్రాధాన్యత నీకే ఇచ్చేటట్లు సహాయము చేయుమని యేసునామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.

👉 దేవుడు మన పక్షాన ఉన్నాడా అనేది నా ఆందోళన కాదు; దేవుడి పక్షాన ఉండటం నా గొప్ప ఆందోళన, ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ సరైనవాడు.-అబ్రహం లింకన్

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...