కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. -యాకోబు 4:4

🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం..🙏.
⛪నేడు దిన ధ్యానము:⛪

 ✝️*దేవునితో సహవాసం* ✝️

కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. 
- యాకోబు 4:4

ఈ లోకంలో జీవించినంత కాలము దేవుని మహిమ పరచడానికి, దేవుడు మనల్ని సృష్టించిన ఈ లోకంలో జీవింప చేస్తున్నారు. కాని మనము మాత్రం ఈ లోకం కొరకే, సమాజంలో స్టేటస్ కొరకే ఆలోచిస్తున్నాము. అలా జీవించే వారికి దేవుని హస్తము దూరంగా ఉంటుందని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. భక్తుడైన యాకోబు గారు ఎవరైతే లోకంలో హెచ్చుగా ఉండాలని కోరుకుంటారో వారు దేవునికి విరోధముగా ఉంటారు. ఈ లోకంలో హెచ్చించు కొనుట కంటే ప్రభువు దృష్టిలో ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చరించారు అని భక్తుడు తన మాటల ద్వారా హెచ్చరిక చేస్తున్నారు. మన హస్తాలను దేవుని దృష్టిలో శుభ్రముగాను, మన హృదయాలను పరిశుభ్రముగా ఉంచుకొని నట్లయితే దేవుడు మనలను దేవుని బిడ్డలుగా ఎంచి, మనలను ఉన్నతమైన స్థితిలో ఉంచి హెచ్చిస్తారు. మనం హెచ్చింపబడటానిక లోకం తో స్నేహం చేయనవసరం లేదు. ఆయన దృష్టిలో నీవు పరిశుద్ధమైన జీవితం జీవించినట్లయితే నీకు కావలసిన స్థితిని నీ అవసరతలను ఆయనే నీకు అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు .అలా ఉండగలిగితే నీకు దేవుని సహాయం ఎల్లప్పుడును కలుగుతుంది. ఆమెన్!

 🛐*ప్రార్ధన:-* 🛐
ప్రియ ప్రభువు ఈ లోక స్నేహము విడిచి నీతో స్నేహం చేయడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్!

👉నిజమైన స్నేహం కంటే విలువైనది ఈ భూమిపై మరొకటి లేదు. - థామస్ అక్వినాస్.

No comments: