19 October 2021

నన్ను బలపర్చువాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీ. 4:13

🙏ప్రభువు నామములో అందరికీ శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము⛪
 
✝️ *సమస్తము దేవునికి సాధ్యమే*✝️
   
  నన్ను బలపర్చువాని యందే నేను సమస్తమును.  చేయగలను. 
ఫిలిప్పీ. 4:13

మన జీవితాలలో దేవుని దాసులైన వారికి ఏదైనా ఇస్తే మేము వారికి ఇంత ఇచ్చాము అలా చుసేవారము అని సహజంగా అందరిలో మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇక్కడ మాటలు చూస్తే అపోస్తులుడైన పౌలుగారిని జ్ఞాపకం చేసుకుని ఆయనకు పంపిన కానుకను బట్టి మీరు ఇన్నాళ్ళకు జ్ఞాపకం చేసుకున్నందుకు సంతోషం. దీనస్థితిలోను, సంపన్నస్థిలోను నేను ఉండుట నేర్చుకొనియున్నాను. అయినప్పటికీ నాకు భయము లేదు ఏ స్థితిలో అయినా ఉండ నేర్చుకొని యున్నాను. ఎందుకంటే నన్ను బలపరచువాడు ఆయనే కాబట్టి వానియందు వెనుదిరగక సమస్తమైన కార్యాలు చేయగలవాడను అని దాసుడు మాట్లాడటం చూస్తాం కదా దాని గురించి మాట్లాడటం కాదు గాని నేను దేవుని దాసునికి ఇస్తున్నాను అనే భావం అలవాటు చేసుకోవాలి. గొప్ప కాదు నువ్వు ఇవ్వకపోయినా దేవుడు తన దాసులకు ఏదో ఒక రూపంలో ఇవ్వక మానడు కాబట్టి దేవునికి మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడు నీకు ఏది అవసరమో అది అను గ్రహించే దేవుడు నీకు తగిన సమయంలో అనుగ్రహిస్తాడు. అటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొనటానికి ఆయన కృప మెండుగా నీకు తోడైయుండును గాక ఆమెన్

✝️ *ప్రార్ధన* ✝️
ప్రియ ప్రభువా నీ పరిచర్య నిరాటంకంగా జరిగించుట నేర్పించమని పరిచర్యలో సమస్తము జరిగించుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమెన్!

విశ్వాసం అన్ని విషయాలను సాధ్యం చేస్తుంది ... ప్రేమ అన్ని విషయాలను సులభతరం చేస్తుంది. - డ్వైట్ L. మూడీ

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...