🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం...🙏
⛪నేడు దిన ధ్యానము:-⛪
✝️ *అంతర్యం పురుషుడు* ✝️
“మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు”.
- 2 కొరింథీయులకు 4:16
మానవులుగా మనం మనలను బాధలకు గురవుతాము అలాగే తోటివారిని బాధపెడతాము. ఎదుటివారు తమను గుర్తించుట లేదని కలతపడుచూ ఉంటాము.
కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం మనలను బాధపెట్టినవారిని సైతం ప్రేమించమని చెప్పుచున్నాడు. గనుక మనకు బాధను కలిగించిన వారిని క్షమించి ప్రేమించుదాము. నీలోని ఆంతర్యపురుషుని వికసింపనిమ్ము.
నిన్ను బాధపెట్టినవారు నీ భార్య/భర్త, తోబుట్టువులు, కుటుంబసభ్యులు మరియు స్నేహితులు ఎవరైనా కావచ్చు. చిన్న చిరునవ్వుతో వారిని క్షమించి ప్రేమతో దగ్గర చేసుకోండి. ప్రభువువలె మాదిరికరముగా ఉండుడి.
🛐 ప్రార్థనా: 🛐
ప్రియమైన పరలోక తండ్రి, నన్ను ఎప్పుడూ బాధపెట్టువారిని క్షమించి ప్రేమించే మనసుని నాకు దయచేయండి. నిన్ను పోలి నడుచుకొనుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.
No comments:
Post a Comment