27 September 2021

దేవుడు మనకొఱకు ఒక రక్షకుని ఈ లోకమునకు పంపించెను. మనకు అన్నీ తానైయుండి మనమేదడిగినా మనకెన్నడూ లేదని చెప్పేవాడు కాడు కదా. మత్తయి – 11:29


⛪ నేటి దిన ధ్యానము ⛪
🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏

 ✝️ *మీమీద నా కాడి* ✝️

“మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి”.

  దేవుడు మనకొఱకు ఒక రక్షకుని  
 ఈ లోకమునకు పంపించెను. 
 మనకు అన్నీ తానైయుండి మనమేదడిగినా   మనకెన్నడూ లేదని చెప్పేవాడు కాడు కదా.  
మత్తయి – 11:29

యేసు మనం తప్పిపోకుండా మనకు ప్రేమతో హద్దులను ఏర్పరిచి మనపై మునుపెన్నడూ ఎవ్వరూ చూపించని ప్రేమను కురిపించెను. ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఎంతో శ్రమించుచూ అపవాది తనను ఆటంకపరచు ప్రతీ సమయంలో ఆయన తన కాడిని దించివేయలేదు.

ఇదే ఆయన మన విషయంలో కోరుకొనేది. గనుక దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్త ప్రకారం నడుచుచూ ఆయనను సంతోష పెట్టెదము.

🛐ప్రార్థనా:🛐
యేసయ్య! తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చు విషయంలో నిన్ను నువ్వే మాదిరిగా కనుపరచినందుకు అనేక వందనములు. మేము కలిగియున్న అన్నింటిలోనూ మొదటి ప్రాధాన్యత నీకే ఇవ్వడానికి మాకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము, ఆమేన్.

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...