Yesuni Bhajiyinpave Manasa | యేసుని భజియింపవే మనసా

80           క్రైస్తవ విశ్వాసమునకుఁ బ్రేరేపణ
రా – యదుకులకాంభోజి                         తా - ఆది
                          
యేసుని భజియింపవే మనసా – నీ దోసములు చనం – జేసి కృపతో బ్రోచునే మనసా = వాసి కెక్కిన క్రీస్తు మోక్షని - వాసిగా కింక వేరేలేరని – దోసిలొగ్గి నుతించితే నిను – త్రోసివేయఁడు దోసకారని || యేసు ||

1. ఏటికే నీ కీదురాశలు – నీ – కెప్పుడును చెవి – నాటవుగ ప్రభు యేసు వాక్యములు = వాటముగ నా తుది దినమున – నీటుమీఱఁగ నిత్యజీవ కి – రీటమును నీకిత్తు నని తన - నోటఁ బల్కిన మాటఁ దప్పఁడు || యేసు ||

2. ఖండనగ నిను చెండియాడఁడు – యెల్లప్పుడుందన మిత్రుడని రక్షించు నతఁడితఁడు = అండఁబాయక నిన్ను ప్రతి దిన – గండములను హరించునని నీ – వుండ గోరిన నిండు నెమ్మది – దండిఁగ నీకుండఁ జెప్పును || యేసు ||

3. లోక సైతాను దుర్భోధలు – నీ వాలింపక యా – లోకరక్షకుని సుబోధలు = ఏక మనసుతో రాత్రింబగలు ప – రాకులేకను గాచు నా ప్రభు – రాకడను నీ వెఱింగినను పర – లోకశుభ సుఖసౌఖ్య మొసఁగును || యేసు ||

4. వంచనలు మది నుంచకే మనసా – నీ – దుర్గుణము తలఁ ద్రుంచి ప్రభుని సేవింపవే మనసా = అంచితముగా క్రీస్తుఁ డీప్ర – పంచ జనుల భవాబ్ధినావగ – నెంచి నీ భవభార మతనిపై – నుంచి సతము ప్రార్థించు మనసా ||యేసు||

5. నిన్ను పాప బంధముల నుండి – రక్షించుటకు స – ర్వోన్నతుని కుమారుఁ డై వెలసి = ఎన్నఁగ నీవొందు దుఃఖము – లన్నిటిని తా ననుభవించెను - విన్న తక్షణ మేసుక్రీస్తుని – విశ్వసించి సుఖించు మనసా ||యేసు||
                                             - రావూరి లక్ష్మయ్య

No comments: