08 August 2021

Nee Kanti Paapala Kaachina Deva | నీ కంటి పాపలా కాచిన దేవా

నీ కంటి పాపలా కాచిన దేవా - నీ చేతి నీడలో దాచిన ప్రభువా 
నీలోనే దీవెన నీలోనే సాంత్వన - నీలోనే రక్షణ నా యేసుయ్యా 
నీలోనే రక్షణ నా యేసయ్యా 

కటిక చీకటిలో కడలి తుఫానులో - నిలువున ముంచెత్తే అలల హోరులో 
కదిలే కడలిపై నడిచావయ్య - అలల హారును అణిచావయ్యా 
కాచినదేవా దాచిన ప్రభువా

అగ్ని గుండములో భగ భగ మంటలలో - నిలువున దహియించే రగిలే జ్వాలలో 
మంటల మధ్యలో నిలిచావయ్యా - వెంట్రుక కాలక కాచావయ్యా 
కాచినదేవా దాచిన ప్రభువా 

ఈ లోక యాత్రలో విశ్వాస పయనంలో - నిలువక పడద్రోసే శ్రమల శోధనలో 
ఆదరణ మాటలే పలికావయ్య - నా చేయి పట్టుకుని నడిపావయ్యా 
కాచినదేవా దాచిన ప్రభువా

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...