19 August 2021

Mudhimi Vachchuvaraku Nannu | ముదిమి వచ్చువరకు నన్ను కాయు

ముదిమి వచ్చువరకు నన్ను కాయు దైవమా 
నీ రెక్కల చాటున నన్ను కప్పి యుంచుమా
యేసయ్య నీతి సూర్యుడా యేసయ్య పరిశుద్ధుడా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 
ఆరాధన ఆరాధన ఆరాధన 

ఒంటరిగా చేరలేను ప్రేమ గూటికి 
రక్తం చిందిన నీ హస్తము లే నన్ను చేర్చాలి 
నీ నుండి ఏదియు వేరు చేయలేదు 
హత్తుకుని ఓదార్చే దేవుడు నీవయ్యా 

తండ్రి లేని నాకు నువ్వే తండ్రిగ మారావు 
నీ సన్నిధినే ముందుగా పంపి ధైర్యపరచెదవు 
నా కోట నా కొండ నా అండ నీవేనయ్యా 
చావైనా బ్రతుకైనా నీతో నా పయనం

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...