11 July 2021

Nee Kanikaramulu Tharatharamuluy | నీ కనికరములు తరతరములు నీ కార్యములు

నీ కనికరములు తరతరములు - నీ కార్యములు ఆశ్చర్యకరములు 
నీ మహిమలు తరతరములు - నీ తలంపులు అత్యున్నతములు 
నీ నామం నిలుచును యుగయుగములు 
నీ నామం నిలుచును తరతరములు 
యేసయ్య యేసయ్య ... యేసయ్య యేసయ్య
యేసయ్య యేసయ్య ... యేసయ్య యేసయ్య

1. మోషేకు ఎర్ర సముద్రము అడ్డుగా నిలబిడగా
యెహోషువ యెరికో గోడలను కూల్చ చుట్టుముట్టగా
నీ కృపను క్రుమ్మరించినావు - నీ ప్రేమను ప్రకటించినావు 
యేసయ్య యేసయ్య ... యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య ... యేసయ్య యేసయ్య 
నీ నామం నిలుచును యుగయుగములు 
నీ నామం నిలుచును తరతరములు

2. సింహాల బోనులో దానియేలు మోకరించి ప్రార్ధించగా 
చెరసాలలో పౌలు సీలలు సంకెళ్లతో స్తుతియించగా
నీ కృపను క్రుమ్మరించినావు - నీ ప్రేమను ప్రకటించినావు 
యేసయ్య యేసయ్య ... యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య ... యేసయ్య యేసయ్య 
నీ నామం నిలుచును యుగయుగములు 
నీ నామం నిలుచును తరతరములు

3. అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వ సిద్ధపడగా
అన్నల పగకు యోసేపు బానిసగా అమ్మబడగా 
నీ కృపను క్రుమ్మరించినావు - నీ ప్రేమను ప్రకటించినావు 
యేసయ్య యేసయ్య ... యేసయ్య యేసయ్య
యేసయ్య యేసయ్య ... యేసయ్య యేసయ్య 
నీ కనికరములు తరతరములు - నీ కార్యములు ఆశ్చర్యకరములు 
నీ మహిమలు తరతరములు - నీ తలంపులు అత్యున్నతములు

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...