27 June 2021

Kaluvari Giri Nundi Pilachina Na Yesu | కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు

కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు
సిలువ మరణమును గెలిచిన నా యేసు
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా

1. మధుర ప్రేమను చూపించి నాపై - మదిని నెమ్మది చేకూర్చినావు
మారని యేసురాజా - మరువను నిన్ను దేవా

2. బెదరి బ్రతుకున నే చెదరిపోగా - వెదకి దరిచేరి సమకూర్చినావు
వేదనలు బాపినావా - విడువను నిన్ను దేవా ||కలువరి

3. మర్యమైన ఇహలోకమందే - నిత్య రాజ్యము నా కొసగినావు
శక్తిగల నీ నామంబు నిరతం - భక్తితోనే ప్రకటింతు దేవా ||కలువరి||


No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...