381
నీవు నన్ను ఆశీర్వదింపని యెడల నిన్ను వెళ్ళనీయను
రా – తోడి, తా – రూపకము
నిన్ను నేను విడువను దేవ - నీవు నను దీవించు వరకు = నిన్ను నమ్మిన వారల నెల్ల - నీవు చక్కగ దీవిం చెదవు ||నిన్ను||
1.నేను శత్రువునై యుండంగ - నీవు నాపై నెనరు జూపి = దాన మిచ్చితివి నా కొర కు - దారుడౌ నీ ప్రియ పుత్రుని ||నిన్ను॥
2.త్రోవ దప్పి తిరుగుచుండ - దుడుకు నైన నన్ను గాంచి = ప్రోవ గోరి మదిని నీవు - త్రోవను బెట్టితివి నన్ను ||నిన్ను॥
3.నాటనుండి నేటి వరకు - నాకుఁ గల్గిన శోధనములలో = నేటుగా నను గాచిన వాడవు - నీవు గావా, ఓ నా తండ్రి ||నిన్ను॥
4.ఇంత కాలము నన్నుగాచి - యికను నన్ను విడువ వనుచు = సంత సించి మదిని నేను - జక్కగ నీ దరి జేరితిని ||నిన్ను||
5.నీవు గాక యెవ రున్నారు - నేల పైని నను గాపాడ = చేవ లేని నాకు నీవు - చేవ గలుగ జేయ గలవు ||నిన్ను||
6.అడుగు వారి కిచ్చెద నంచు - నాన తిచ్చినాను గాన = నడిగెద నిను సాహాయ్యంబు - నాత్మవై యున్నట్టి తండ్రి ||నిన్ను||
7.నాదు ప్రార్థన లన్నియు నీవు - నీదు కృపచే నాలకించి = నీదు సరణిని నిల్పి నన్ను - నేర్పు దనరగ రక్షించితివి ||నిన్ను||
- పులిపాక జగన్నాధం
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment