ఎవరూ చూపని అనురాగమున -
ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది - ఇంకెవరూ
ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ - మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ
1. దేహమే దేవుని ఆలయమేనని - దేవుని ఆత్మకు నిలయము నేనని
మలినము కడిగి ఆత్మతోనింపి - సమముద్రించి శుద్ధహృదయము
కలిగించినది రాకడ కొరకే ||ఇదే కదా||
2. మార్గము తెలియక మౌనము వీడక - వేదన కలిగిన నను విడనాడక
ప్రేమతో చేరి గమ్యము చూపి - ఒంటరి చేయక జంటగ నిలచి
వేదన బాధలు తొలగించినది ||ఇదే కదా||
3. చీకటికమ్మిన చెలిమివాకిట - చెదరిన మనస్సుతో ఒంటరినై
సత్యము నమ్మక మమతమ వీడి - ఎన్నడు ప్రభుని స్వరమును వినక
శిలగా మారిన నను మార్చినది ||ఇదే కదా||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment