Krupagala Deva Dayagala Raaja | కృపగల దేవా దయగల రాజ

కృపగల దేవా దయగల రాజ - 
చేరితి నిన్నే బహు ఘన తేజ
నీ చరణములే నే కోరితిని - నీ వరములనే నే వేడితిని 
సర్వాధికారి నీవే దేవా - నా సహకారి నీవే ప్రభువా 
నా కోరికలే సఫలము చేసి - ఆలోచనలే నెరవేర్చితివి 
అర్పించెదము నా సర్వమును నీకే దేవా - 
ఆరాధించి ఆనందించెద నీలో దేవా
                                                        ||కృపగల||
త్రోవమ చూపే తారవు నీవే - గమ్యము చేర్చే సారధి నీవే (2)
జీవనయాత్ర శుభప్రదమాయే - నా ప్రతి ప్రార్థన పరిమళమాయే
నీ ఉదయకాంతిలో నను నడుపుము - నా హృదిని నీ శాంతితో నింపుము (2)
                                                        ||కృపగల||
కృప చూపి నన్ను అభిషేకించి - వాగ్దానములు నెరవేర్చినావే (2)
బహు వింతగా నను ప్రేమించినావే - బలమైన జనముగా నమ మార్చినావే 
నీ కీర్తి జగమంత వివరింతును - నీ దివ్యమహిమలను ప్రకటింతును (2)
                                                        ||కృపగల||
నా యేసురాజ వరుడైన దేవా - మేఘాల మీద దిగివచ్చువేళ (2)
ఆకాశవీధిలో కమనీయ కాంతిలో - ప్రియమైన సంఘమై నిను చేరెదను 
నిలిచెదను నీతోనే సీయోనులో - జీవింతు నీలోనే యుగయుగములు (2)
                                                         ||కృపగల||
DOWNLOAD MP3 SONG HERE 👇

2 comments:

Unknown said...

Praise the lord

Unknown said...

Praise the lord