26 March 2021

Chuchithi Ni Momupai Chindina | చూచితి నీ మోముపై చిందిన రక్తము

చూచితి నీ మోముపై చిందిన రక్తము 
తలచితి నీ ప్రేమను మదికి అందనిదాయే 
రాజమకుటము మారిపోయే ముళ్లమకుటము గా 
సింహాసనమే సిలువ గా మారి శిక్షకు గురి ఆయేగా
పరిమితి లేని కలువరి ప్రేమను పరిహాసము చేసిరే 
ఆ ప్రేమనెరిగి నీ పాదసేవయే చాలని నీచెంత చేరితిని యేసు.
1.నేలపై ఒలికిన నీ రక్తధారలే - ప్రతి పాపిని కడిగెను
ఆ రక్తధారలే పాపికిమార్గమై- పరముకు ప్రవహించెను (2)
మట్టి దేహమును మహిమగా మార్చుటకు (2)
మాపై నీకున్న సంకల్ప ప్రేమను పరిహాసము చేసిరే(2) యేసు...
                                           ||చూచితి||
2.సిలువలొ చిమ్మిన రక్తపు జల్లులు- ప్రతి రోగిని తాకెను
చితికిన దేహమున ఒలికిన రుధిరము పరమౌషదమాయేను(2) 
మారోగములను భరియించుట - మారోగములను హరియించుటకు 
మాపై నీకున్న ఎనలేని ప్రేమను అవహేళన చేసిరే(2) యేసు
                                           ||చూచితి||


No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...