01 February 2021

Nee Krupanu Gurchi Be Paadeda | నీ కృపను గూర్చి నే పాడెదా

నీ కృపను గూర్చి నే పాడెదా -
నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా(2)
నిత్యము నే పాడెదా నా ప్రభుని కొనియాడెదా(2)
మహిమా ఘనతా ప్రభావము చెల్లించేదా ...(2)
                                             ||నీ కృపను||
1. ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా -
    నిందలో అపనిందలో నాకు తోడు నీడగా (2)
    నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా(2)
    భయమా దిగులా మనసా నీకేలా (2)
                                             ||నీ కృపను||
2. వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించినా 
    మరణమై బలియాగమై నన్ను విడిపించినా (2)
    నా యేసు నాకుండగా నా క్రీస్తే నాఅండగా(2)
    భయమా దిగులా మనసా నీకేలా (2)
                                             ||నీ కృపను||
3. మార్గమై నా గమ్యమై నన్ను నడిపించినా (2) 
    ఓర్పుయై ఓదార్పుయై నన్నాదరించినా (2)
    నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా(2)
    భయమా దిగులా మనసా నీకేలా(2)
                                             ||నీ కృపను||
_________________________

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...