10 January 2021

Ne saageda yesunitho నే సాగెద యేసునితో

నే సాగెద యేసునితో - నా జీవిత కాలమంతా (2)

1.యేసుతో గడిపెద - యేసుతో నడిచెద (2)
   పరమును చేరగ నే వెళ్లెద (2)
   హనోకు వలె సాగెదా ||నే సాగెద||

2.వెనుక శత్రువులు - వెంటాడిననూ (2)
   ముందు సముద్రము ఎదురొచ్చినా (2)
   మోషె వలె సాగెదా  ||నే సాగెద||

3.లోకపు శ్రమలు - నన్నెదిరించినా (2)
   కఠినులు రాళ్ళతో హింసించినా (2)
   స్తెఫను వలె సాగెదా  ||నే సాగెద||

4.బ్రతుకుట క్రీస్తే - చావైనా మేలే (2)
   క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2)
   పౌలు వలె సాగెదా  ||నే సాగెద||

5.తల్లి మరచిన - తండ్రి విడచిన (2)
   బంధువులే నన్ను వెలివేసినా (2)
   బలవంతుని వలె సాగెదా ||నే సాగెద||

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...