Sthuthinchedanu Sthuthinchedanu | స్తుతించెదను స్తుతించెదను నా యేసు

స్తుతించెదను - స్తుతించెదను - నా యేసు ప్రభున్ 
కృతజ్ఞతతో - అనుదినము 

1. ఉన్నత దేవుడు - సర్వాధిపతియు -
ఉర్వీపరిపాలక ఉన్నతం విసర్జించి
నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని 
ఉదయం సంధ్యా ఎల్లప్పుడును - 
ఉత్సాహధ్వనితో నే పాడెదను(2)

2. నాశనకరమైన పాపపు గుంట నుండి - 
నరక వేదననుండి - నన్ను విడిపించి
 పిలిచిన దేవ - నిర్మల స్వరూప 
నీతి న్యాయం - సంతోషముతో- 
నిత్య జీవము నాకిచ్చితివి (2)
 
3. పాపము క్షమించి - రోగము బాబ- 
భయమును తీర్చి - పవిత్రదాయక - 
పావనమూర్తి - పరిశుద్ధమిచ్చిన 
పరమపాదం - శరణ్యం - 
నాకు పరమ రాజ్య పుణ్య దేవ (2)

4. తల్లిగర్భమునకు ముందేర్పరచి
దేహము నమర్చియును 
దక్షిణబాహువులతో పట్టుకొనిన 
దయా సంపూర్ణుడా దిక్కుజయము 
ఆదరణయు - దయతోను అనుగ్రహించితివి (2)

5. సిలువ నెత్తి శ్రమలు సహించ -
సేవకు పిలచిన స్నేహ 
దర్శక వీరయోధ - సంశయ హారక
 శ్రమలు నింద ఆకలియైన -
స్నేహము నుండి ఎడబాపునె  (2) 

No comments: