06 November 2020

Ne Nendukani Nee Sothugaa | నే నెందుకని నీ సొత్తుగా

నీనెందుకని నీ సొత్తుగా మారితిని ?
యేసయ్యా నీ రక్తముచే - కడగబడినందున
నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ

1. నీ పరిచర్యను తుదముట్టించుటే - నా 
    నియమమాయనే
    నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడనైతిని 
    అహా ! నా ధన్యత ఓహో ! నా భాగ్యము 
    ఏమని వర్ణింతును                           ||నేనె||

2. నీ శ్రమలలో పాలొందుటయే - దర్శనమాయెనే 
    నా తనువందున శ్రమలు సహించి 
    నీ వారసుడనైతినే 
    అహా ! నా ధన్యత ఓహో ! నా భాగ్యము 
    ఏమని వర్ణింతును                           ||నేనె||

3. నీలో నేనుండుటే నాలో నీవుండుటే - ఆత్మీయ
    అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే 
    పరిపూర్ణత చెందెద 
    అహా ! నా ధన్యత ఓహో ! నా భాగ్యము
    ఏమని వర్ణింతును                          ||నేనె||

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...