నీ ప్రేమ గీతం పాడెద నీ గొప్ప కార్యం చాటెద
నా జీవితం మార్చిన యేసయ్యా
ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా ||సంగీత||
1.నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి -
కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2)
పాపములు క్షమియించి నను మార్చిన
దోషములు భరియించి దరిచేర్చిన ||నీ ప్రేమ||
2.నా కష్ట సమయమున నా చెంతనే నిలచి -
విడువక నడిపించిన విధమును వివరించెద (2)
క్షేమమును కలిగించి నను లేపిన
దీవెనలు కురిపించి కృపచూపిన ||నీ ప్రేమ||
3.నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి -
కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద(2)
వాక్యముతో దర్శించి బలపరిచిన
సత్యముతో సంధించి స్థిరపరిచిన ||నీ ప్రేమ||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment