Naa hrudaya logililo lyrics | నా హృదయ లోగిలిలో

నా హృదయ లోగిలిలో - కొలువైన నా స్వామి 
నీ ప్రేమ కౌగిలిలో - నను ఓదిగిపోని (2)
నీ ఆత్మతో ననునిండని - నీసాక్షిగా ఇలలో నన్నుండని ||నా హృదయ||
 
1.నా లోపల సంచరించి - నాతో భుజియించి
జీవపు మార్గము చూపించి-సరిగా నడిపించి (2)
నా జీవితం వెలిగించినావా (2)
నీ రూపమే నాలో ముద్రించినావ ||నా హృదయ||
 
2.బలహీనతలను హరియించి - శక్తితో దీవించి
అజ్ఞానము నిర్ములించి-సత్యము బోధించి (2)
నా భారమే భరియించినావ (2)
నీ శాంతినే నాలో స్థాపించినావ ||నా హృదయ||
 
3.అనురాగముతో బందించి - ఆప్యాయత పంచి
ఆనందము ననుగ్రహించి-ఆత్మీయత పెంచి (2)
నా శోకమే తొలగించినావ (2)
స్తుతిగానమే నాలో పలికించినావ ||నా హృదయ||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: