కరుణామయుని శరణు తరుణోదయం
తెరమరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది
||సుధామధుర||
1. దివిరాజుగా భువికి దిగినాడని-
రవిరాజుగా యిలలో మిగిలాడని(2)
నవలోక గమనాలు తెరిచాడని(2)
పరలోక భవనాలు పిలిచాయని(2)
ఆరని జీవన జ్యోతిగ వెలిసే తారకటొచ్చింది-
పాడిన పాటల పశువులశాలకు ఊయల వేసింది(2)
ఆ జన్మమే ఒకమర్మము ఆమర్మమే ఆనుబంధము(2)
||సుధామధుర||
2. లోకాలలో పాపశోకాలలో-
ఏకాకులై బ్రతుకు అవివేకుల(2)
క్షమహృదయ సహనాలు సమపాళ్ళుగా(2l
ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2)
నమ్మినవారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు-
నిత్యజీవాల జీవ జలాల పెన్నిధి ఆ ప్రభువు(2)
నినుగావగా నిరుపేదగా జన్మించగా యిలపండుగ(2)
||సుధామధుర||
3. పాపాత్ముల దరికి పిలిచాడని-
రోగాత్ములన్ బాగుచేశాడని (2)
మన పాప రోగంబు - బాపాడని (2)
తన ప్రాణమున్ అర్పించాడని (2)
నమ్మిన వారిని రమ్మని పిలిచెను రక్షకుడా యేసు
సర్వజనాల జీవ జలాల పెన్నిధి ఆ ప్రభువే(2)
ఆ జన్మమే - అనుబంధమే అనురాగమే - ఆనందమే(2)
||సుధామధుర||
No comments:
Post a Comment