Prema Yesayya Prema | ప్రేమ యేసయ్యా ప్రేమా

ప్రేమ యేసయ్యా ప్రేమా (4) 
మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2)

1. తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ 
    తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2)
    నే ఏడుస్తుంటే - ఎత్తుకున్న ప్రేమా 
    తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2)    ||ప్రేమ||

2. నేను మరచిన గాని నను మరువనన్న ప్రేమ (2)
    నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2) 
    నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా 
    తన కృపలో నిలబెట్టుకొన్న ప్రేమ (2)        ||ప్రేమ||

3. నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ 
    నేను ఎరుగకముందే ఏర్పరచుకున్న ప్రేమ (2)
    తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా
    ఎదలోతుల్లో నను దాచుకున్న ప్రేమా (2). ||ప్రేమ||

No comments: