12 August 2020

Nee Dhanamu Nee Ghanamu | నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే

578       
కృతజ్ఞతార్పణలు
రా - హిందుస్థానీ కన్నడ,  తా - తిశ్రజాతి ఏక

నీ ధనము - నీ ఘనము - ప్రభు యేసుదే - 
నీ దశమ భాగము నీయ - వెనుదీతువా వెనుదీతువా ||

1.ధరలోన ధనధాన్యముల నీయగా - కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాధుండు నీకీయగా - మరి యేసు కొరకీయ వెనుదీతువా ||నీ ధనము||

2.పాడిపంటలు ప్రభువు నీకీయగా - కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభుయేసు నామంబును - గడువేల ప్రభుకీయ ఓ క్రైస్తవా ||నీ ధనము||

3.వెలుగునీడలు గాలి వర్షంబులు - కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా వెలిగించ ధరపైన ప్రభు నామము -  కలిమికొలది ప్రభునకర్పింపవా ||నీ ధనము||

4. కలిగించే సకలంబు సమృద్ధిగా - తొలగించే పలుబాధ భరితంబులు - బలియాయె నీ పాపముల కేసువే -  చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||నీ ధనము||
                       – బొంతా సముయేలు
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...