నిన్నాశ్రయించినవేళ - నన్నాదుకొంటివి ప్రభువా
1. చాలునయ్యా దేవా - ఈ జన్మ ధన్యమే ప్రభువా
పాపకూపము విడిచి - నీ దారి నడిచితి దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా||నాదు||
2. కన్నుగానని దిశగా - బహు దూరమేగితినయ్యా
నీ ప్రేమ వాక్యము వినగా - నా కళ్ళు కరిగెను దేవా నిన్నాశ్రయించితి ప్రభువా||నాదు||
3. లోకమంతా విషమై - నరకాగ్ని జ్వాలలు
ఆ దారి నడువక నన్ను - కాపాడినావని దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా||నాదు||
4. జాలిగల నా దేవా - నీ చేయి చాపవా విభువా
చేరగల నీ దరికి - నే పాపినయ్యా ప్రభువా
నే పాపినయ్యా ప్రభువా||నాదు||
5. ఆరిపోని జ్యోతివై- నా కన్నులలోని కాంతివై
ఎంతకాలముంటివి - ఎంతగా ప్రేమించితివి
నన్నెంతగా ప్రేమించితివి||నాదు||
DOWNLOAD MP3 SONG HERE 👇
1 comment:
Wonderful heart touching song ever
Post a Comment